స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్

స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ
– తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అక్ర‌మ, అఘాయిత్యాల‌ను ప్ర‌తి ఒక్క‌రు ఎదింరించాల‌ని స్పూర్తినిచ్చిన ధీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మ అని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణంలోని విజ‌య విద్యాల‌య పాఠ‌శాల స‌మీపంలో ర‌జ‌క సంఘం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఐల‌మ్మ వ‌ర్దంతిలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ రాష్ట్ర బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌తో క‌లిసి ఐల‌మ్మ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ప‌లువురు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములపై రజాకార్లపై ఉక్కు పిడికిలి బిగించిన తెలంగాణ వీరవనిత, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆమె పోరాట స్పూర్తి అంద‌రికి ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిలర్లు నీరజ బాల్ రెడ్డి, రామకృష్ణ, వెంకన్న గౌడ్, బోయ రవిరాజు, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.