సామాజిక సేవ బీసీ సంఘం బాధ్యత

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సామాజిక సేవ బీసీ సంఘం బాధ్యత
– విద్యార్థుల ఆరోగ్యం కోసమే వైద్య శిబిరాలు
– బీసీ సంఘం జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్
– విజయవంతంగా మూడో విడత వైద్య శిబిరం
– సేవలు అందించిన ఐఎంఏ అసోసియేషన్ వైద్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉద్యమాలతో పాటు బీసీల పట్ల సామాజిక సేవ బీసీ సంఘం బాధ్యతగా భావిస్తున్నామని సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

ప్రతి ఆదివారం బీసీ విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం మూడో విడతలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తాండూరు శాఖ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలతో పాటు ఉచితంగా మందులు అందజేశారు.

ఈ సందర్భంగా బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ ఉద్యమమే కాదు… సామాజిక సేవ కూడా మా బాధ్యత. సమాజ అభివృద్ధికి విద్య ఎంత ముఖ్యమో, విద్యార్థుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐఏఎం సభ్యులు డా. శివమోహన్ రెడ్డి, డా. మల్లికార్జున్, డా. జగదీష్‌ రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, హాస్టల్ వార్డెన్ భాగ్యలక్ష్మి, బీసీ మహిళా సంఘం నాయకులు అనిత, మంజుల, విజయలక్ష్మి, మంబాపూర్ మంజుల, మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, బసంత్ కుమార్, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, పరమేష్, హరిప్రసాద్, పాండు గౌడ్, దుబాయ్ వెంకట్, తాండ్ర నరేష్, యాసర్, వినయ్, కిరణ్, ఉద్యమ గాయకుడు బాలు, శివాజీ, హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది, బీసీ సంఘం నాయకులు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతులకే చందాలు..!