అరుదైన ఘనత సాధించిన సూపర్‌ స్టార్‌

సినిమా

అరుదైన ఘనత సాధించిన సూపర్‌ స్టార్‌
ఎఫ్‌బీలో 15మిలియ‌న్ల‌కు చేరిన ఫాలోవ‌ర్ల సంఖ్య
పండ‌గ చేసుకుంటున్న మ‌హేష్ ఫ్యాన్స్‌

ద‌ర్శిని : తనదైన అందం, నటనతో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న మహేష్‌ బాబుకు ఉన్న ఫాలోయింగ్‌ అలాంటిదిలాంటిది కాదు. వరుస విజయాలతో ఇండస్ట్రీ హిట్‌లను సొంతం చేసుకుంటూ సరికొత్త ట్రెండ్‌ను సెట్‌ చేస్తున్నారు మహేష్‌. ఇప్పటికే పలు అరుదైన రికార్డులను తిరగరాసిన మహేష్‌ బాబు తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌లో మహేష్‌ను ఫాలో అవుతోన్న వారి సంఖ్య తాజాగా 15 మిలియన్లు దాటింది. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో మహేష్‌ ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. సోషల్‌ మీడియాలో మహేష్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. మహేష్‌ ఓ చిన్న పోస్ట్ చేస్తే చాలు లైక్‌లు, షేర్‌లతో సోషల్‌ మీడియా హోరెత్తుతుంటాయి. తాజాగా ఆయ‌న సాధించిన రికార్డుతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మ‌రోవైపు మహేష్‌ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.