వేసవి బరిలో హరిహర వీరమల్లు
– తేది ప్రకటించిన చిత్రబృందం
దర్శిని: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తుంది. పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే యేడాది వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ 28వ చిత్రం ‘‘జాతర షురూ’’ అంటూ ప్రీలుక్ విడుదల చేశారు. మైత్రీ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రం.. త్వరలో పట్టాలెక్కనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయనున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను గురువారమే విడుదల చేశారు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
