– రిలీజ్‌డేట్‌పై ఉత్కంఠ
దర్శక ధీరుడు రాజమౌళీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని చిత్ర బృందం సభ్యులు తెలిపారు. చిన్న చితకా ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేశాం, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలనుతెలియజేస్తాం’’ అంటూ చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఫైనల్ సాంగ్ చిత్రీకరణకు ఉక్రెయిన్‌కు వెళ్లిన యూనిట్ పాటను పూర్తి చేసుకోగానే ఈ అప్‌డేట్‌ను ఇచ్చారు. మరి రిలీజ్‌డేట్‌పై జక్కన్న అండ్ టీమ్ ఎలాంటి అప్‌డేట్ ఇస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

