రేపటి రైతు దర్నాను జయప్రదం చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి రైతు దర్నాను జయప్రదం చేయండి
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు తాండూరులో నియోజకవర్గ స్థాయి రైతు దర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.రమష్‌ మహరాజ్‌ల పిలుపు మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలపడం జరుగుతుందన్నారు. ధరణి, రైతు రుణమాఫీ, రైతు బీమా, పోడు భూములు, ధాన్యం, మిరప, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు వంటి రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, సినీయర్ నాయకులు, ఎన్ఎస్‌యూఐ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.