డ్రగ్స్‌ మత్తులో దాడులు దుర్మార్గం

తాండూరు రాజకీయం వికారాబాద్

డ్రగ్స్‌ మత్తులో దాడులు దుర్మార్గం
– మురళీగౌడ్ ఇంటిపై దాడియత్నం అప్రజాస్వామికం
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పతనం ప్రారంభం
– చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– దాడిని ఖండించిన బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్‌ మత్తులో దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి తాండూరు పట్టణంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, బీజేపీ నేతల మురళీకృష్ణ గౌడ్ నివాసంపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం పట్ల మంగళవారం చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ తదితరులు ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడిని ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో మురళీకృష్ణ గౌడ్ కు ఉన్న ఆదరణతో పాటు చేస్తున్న కార్యక్రమాలకు ఓర్వలేక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన అనుచరులు దాడులకు పాల్పడుడుతున్నారని అన్నారు. శివ స్వాముల ఘటనలో అక్రమంగా జైలుకు పంపి బేయిల్ పై వచ్చిన మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడులు చేయడం అప్రజా స్వామికమన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చీకటి కోణాలు, ఆక్రమ దందాలు అన్నీ ఆటు నందకుమార్ కు, ఇటు మురళీకృష్ణ గౌడకు అంతా తెలుసని అన్నారు. అందుకనే మురళీకృష్ణ గౌడ్‌ను చంపేదుకు యత్నించారని ఆరోపించారు. పోలీసుల ముందే బీఆర్ఎస్ నాయకులు వచ్చి దాడికి యత్నించడం దారుణమన్నారు. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలపై దాడికి యత్నించడం ముమ్మాటికి హత్యాయత్నమే అన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తామని, కోర్టులో పోరాడుతామన్నారు. అదేవిధంగా గతంలో మురళీకృష్ణ గౌడ్ కారు డ్రైవర్ బాలుపై కూడా హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తూ తన పతనం కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై డ్రగ్స్‌కు బానిసై ఈ వ్యవహరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆయనపై చెక్ బౌన్స్ తో పాటు బెంగలూరు డగ్ర్‌ కేసు ఉందని, ఇప్పుడు హత్యాయత్నం కేసు నడిపిస్తామన్నారు. చట్టం ప్రకారం, న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా వ్యాపారంలో, రాజకీయ పరంగా తనతో పాటు మురళీకృష్ణ గౌడ్ కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దోఖా చేశారని సంచలన వాఖ్యలు చేశారు. మురళీకృష్ణ గౌడ్ పరామర్శకు వచ్చిన నేతలను అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని అన్నారు. వీటికి బీజేపీ భయపడదన్నారు. అదేవిధంగా మురళీకృష్ణ గౌడ్‌, కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కరణం ప్రహల్లాద్ రావు, రాఘవ రెడ్డి, పాండురంగా రెడ్డి, వెంకటయ్య, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, మల్లప్ప, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.