దోపిడిలు లేవు.. వేధింపులు లేవు..!

క్రైం తాండూరు వికారాబాద్

దోపిడిలు లేవు.. వేధింపులు లేవు..!
– వార్షిక యేడాదిలో 238 కేసుల నమోదు
– కరణ్‌కోట్ పీఎస్ పరిధిలో తగ్గిన నేరాలు
– వెల్లడించిన ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: పోలీసుశాఖ తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో దోపిడిలు, లైగింక వేధింపులపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. గురువారం వార్షిక సంవత్సరంలో నమోదైన కేసుల వివరాల జాబితాను ప్రకటించారు. ఈ యేడాది మొత్తం 238 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో హత్యలు-2, అత్యాచారాలు-4, ఆత్మహత్యలు-24, దొంగతనాలు-14, అపహరణలు(కిడ్నాప్‌)-2, రోడ్డు ప్రమాదాలలో మృతులు-10, గాయపడిన బాధితులు -6, అదృశ్యం -29, ఇతర కేసులు 147 నమోదయ్యాయని వివరించారు. ఈ యేడాది దోపిడిలు, లైంగిక వేధింపులపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని అన్నారు. మొత్తంగా తాండూరు రూరల్ సర్కిల్‌లోని కరణ్‌కోట్ పోలీస్టేషన్‌ పరిధిలో నేరాల శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టిసారిస్తామని పేర్కొన్నారు.