సంప్రదాయాలకు అద్దంలాంటివి బతుకమ్మ పాటలు
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పాటలు అద్దంపడతాయని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరుకు చెందిన జానపద కళాకారుడు, డ్యాన్స్ మాస్టర్ ఆశోక్ ఆధ్వర్యంలో కొమ్మ కొమ్మన పూసే తంగేడి పూలు అంటూ సాగే బతుకమ్మ పాటను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండగ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరు తెలంగాణ సంప్రదాయ పద్దతిలో రూపొందించిన ఈ పాటను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విశ్రాంతి ఉపాధ్యాయులు గోవింద్ రావు గారు తదితరులు పాల్గొన్నారు
