శ్రద్ద వహిస్తేనే గుండెకు ఆరోగ్యం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రద్ద వహిస్తేనే గుండెకు ఆరోగ్యం..!
– అన్ని వ్యసనాలను దూరం చేసుకోవాల్సిందే
– ఆహార నియమాలు తప్పక పాటించాలి
– గుండె వైద్య నిపుణులు డా. దయా వాస్వనీ
– యువ జాగృతి అవగాహన సదస్సుకు స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : హృదయ లయపై శ్రద్ధ వహిస్తేనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని ప్రముఖ గుండె వైద్య నిపుణురాలు డా. దయా వాస్వనీ అన్నారు. గురువారం తాండూరు యువ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సహాకారంతో గుండె పోటుతో యువత అకస్మిక మరణాల నివారణ అనే అంశంపై పట్టణంలోని హిమాలయ హోటల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన గుండె వైద్య నిపుణురాలు డా. దయా వాస్వానీ తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె గుండె పోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

గుండె ఆరోగ్యం కోసం పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, వ్యాయామాలపై అవగాహన కల్పించారు. సీపీఆర్ విధానంపై కూడా వివరించారు. ముందు జాగ్రత్తగా 18 ఏండ్లు నిండిన యువత బీపీ, షుగర్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. చెడు అలవాట్లను, మత్తు, మద్యం వంటి వ్యసరాలను మానుకొ వాలన్నారు. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తేనే అకస్మిక మరణాల నుంచి సురక్షితంగా ఉండొచ్చన్నారు. అదేవిధంగా డా.జయప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దానిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సొంత వైద్యం, నాటు వైద్యానికి దూరంగా ఉండాలన్నారు. ఐఎంఏ తరుపున ఆరోగ్య, వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు.

అదేవిధంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ యవత గుండె పోటు మరణాల నుంచి కాపాడుకునేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. యువ జాగృతి కార్యక్రమానికి స్పందన రావడం హర్షణీయమని యువ జాగృతి తాండూరు అధ్యక్షులు పర్యాద రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఠాకూర్, అస్తికర్ సంతోష్, జుంటుపల్లి వెంకట్, యువ జాగృతి సభ్యులు నర్సింహా, శివ, నరేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం..!