మట్కా స్థావరంపై దాడి

క్రైం తాండూరు వికారాబాద్

మట్కా స్థావరంపై దాడి
– రూ. 8,140లు, 4 మోబైల్స్‌ సీజ్
– కలకలం రేపిన టాస్క్‌ ఫోర్స్‌ దాడులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నిషేధిత మట్కా జూదంపై వికారాబాద్‌ జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌లోని స్థావరంపై దాడులు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్‌లో ఓ నివాసంలో 1)గోపాల్ రెడ్డి 2)బోయ వెంకటేష్ 3)షేక్ వసీం 4)చిన్నపాగ మధుకర్ 5)బుడిగే జంగం కృష్ణ మొదలైన కొందరు వ్యక్తులు గుట్టుగా మట్కా జూదం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు నిఘా ఉంచారు. బుధవారం ఇంటిపై నిఘా ఉంచి రాత్రి వేళ ఒక్కసారిగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి మట్కా చిట్టీలతో పాటు రూ. 8,140ల నగదు, 4 మొబైల్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా తాండూరులో మట్కా జూదం పెచ్చుమీరింది. అడ్డుకట్ట వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేయడంతో మట్కారాయుళ్ల గుండెల్లో గుబులు పెరిగింది.