బీఆర్ఎస్ బలమెంత..!
– తాండూరు సెగ్మెంట్‌లో జోరుగా చర్చ
– పోలింగ్ చివరి రోజు పరిణాలపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు లెక్కలు వేసుకుంటోంది. వికారాబాద్ జిల్లాలో కూడా ఈ లెక్కలు సాగుతున్నాయి. గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ధీమా ఉన్నారు. ఎన్నికల ముందు వరకు జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మద్య త్రిముఖ పోటీ కనిపించింది. పోలింగ్ తరువాత పరిస్థితి తారుమారు అయ్యింది. కేవలం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల మద్య గెలుపు ఓటముల చర్చ జరుగుతోంది. అయితే తాండూరు సెగ్మెంట్‌లో మాత్రం పరిణామాలు భిన్నంగా ఉన్నాయి.
కాంగ్రెస్, బీజేపీలో ఏదో పార్టీ విజయం ఖాయంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో రెండు పార్టీలకు పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ రోజు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేతులెత్తేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ రోజు కేంద్రాలలో ఎజెంట్లను పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు ఏ పార్టీకి మళ్లీ ఉంటారని జోరుగా చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలమెంత అని చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు మళ్లాయా.. బీజేపీకీ మళ్లాయా అని మాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీ గెలిచినా బీఆర్ఎస్ ఓట్ల పాత్ర కీలంగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇదికూడ చదవండి…

