ఎకరా.. బకరా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎకరా.. బకరా..!
– సీఎం రేవంత్ రెడ్డి రైమింగ్ అదుర్స్
– తాండూరు ఎమ్మెల్యేపై సెటైర్ వైరల్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : సినిమాల్లో హిరోలు పలికే రైమింగ్ డైలాగ్‌లు విజిల్స్‌ కొట్టిస్తాయి. రాజకీయాల్లో కొందరు నేతలు పలికే డైలాగులు కూడా అంతే హైలెట్‌గా పేలుతాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రైమింగ్ కామెంట్‌ అదుర్స్ అనిపించింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై వేసిన సెటైర్ స్థానికంగా వైరల్‌గా మారింది. బుధవారం సీఎం సొంత నియోజకవర్గం కోడంగల్‌లో ఎస్‌ఐఆర్‌పై కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎస్‌ఐఆర్‌పై ఖచ్చితత్వంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై సందర్భోచితంగా రైమింగ్ డైలాగ్ వేశారు.

మన మనోహరన్న ఎకరాలు కొని గజాలలో బకరాలకు అమ్ముతున్నారని డైలాగ్ కొట్టారు. అది ఒక పది రోజులు వాయిదా పెట్టి.. బూతు వైస్‌గా పర్యటించి ఎస్‌ఐఆర్‌పై పనిచేయాలని సూచించారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గంలో వైరల్‌గా మారింది.

కొంపముంచిన నిద్రమత్తు..!