తాండూరు, కోడంగల్ ఖాజీగా షబ్బీర్ అహమ్మద్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు, కోడంగల్ ఖాజీగా షబ్బీర్ అహమ్మద్
– నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తాండూరు,దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కోడంగల్ నియోజకవర్గాల ఖాజీగా తాండూరుకు చెందిన మౌలానా మహమ్మద్ షబ్బీర్ అహమ్మద్ నియామకం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఖాజీ చట్టం ప్రకారం జీఓ 26 ద్వారా రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తాండూరు నియోజకవర్గం, కోడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారి వివాహా ఒప్పందాలు ఖాజీ మహమ్మద్ షబ్బీర్ అహమ్మద్ పర్యవేక్షణలో జరుగుతాయని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఖాజీగా నియామకమైన షబ్బీర్ అహమ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివాహా కార్యక్రమాలను జరిపించడం జరుగుతుందన్నారు. వివాహాలు జరిపించే తల్లిదండ్రులు పత్రాలు, ఆధార్ కార్డులతో ఒక వారం ముందు సంప్రదించాలని, పూర్తి వివరాలకు సెల్: 60160 77996, 96406993492లకు సంప్రదించాలని సూచించారు. మరోవైపు తాండూరు, కోడంగల్ ఖాజీగా నియామకమైన షబ్బీర్ అహమ్మద్ కు పలువురు పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.