మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
– బీవీజీ ఫౌండేషన్ నుంచి అందించిన డా.సంపత్ కుమార్
– వడ్డె శ్రీనివాస్ నుంచి కూడా సాయం అందజేత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ మృతుని కుటుంబానికి F నేతలు ఆర్థిక సాయం అందజేశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కేసీ బాలయ్య అనారోగ్యానికి గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు.

గురువారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బాలాజీ ఆసుపత్రి అధినేత డా. సంపత్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. తన అనుచరులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ జవరత్నం, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ వడ్డె కృష్ణ ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు.

అదేవిధంగా తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ కూడా గ్రామ పెద్దలు లాలప్ప, బలరాం, యువకులు నారాయణ గౌడ్, కుర్వ శ్రీనివాస్ తదితరుల ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం అందించిన డా. సంపత్ కుమార్, వడ్డె శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

