కేర‌ళలో కొన‌సాగుతున్న వైర‌స్ ఉధృతి

జాతీయం తెలంగాణ

కేర‌ళలో కొన‌సాగుతున్న వైర‌స్ ఉధృతి
– తాజాగా 25వేల కేసుల న‌మోదు
ద‌ర్శ‌నిని బ్యూరో : దేశంలో కొవిడ్ కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 37,875 మందికి పాజిటివ్ గా తేలింది. మరో 369 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. నిన్న 39,114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు కేరళలో వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో 25వేలకు పైగా ఆ ఒక్క రాష్ట్రంలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 189 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.