గ్యాస్‌, కరెంట్ లేకుండా వంట..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

గ్యాస్‌, కరెంట్ లేకుండా వంట..!
– స్పెషల్‌ స్టవ్‌ ఇంట్లో ఉంటే చాలు
– అందుబాటులోకి తెస్తున్న ఇండియన్ అయిల్ సంస్థ
– ఈ కొత్త గ్యాస్‌ స్టవ్‌ ధర ఎంతంటే…?
దర్శిని డెస్క్‌: గ్యాస్‌ లేకుండా.. కరెంట్ సాయం లేకుండా ఇక వంట చేసుకునే సదుపాయం రాబోతోంది. పెరిగిన ధరల కష్టాలను ఈ స్పెషల్‌ స్టవ్‌ తీర్చబోతోంది. దినికి గ్యాస్ సిలిండర్ అవసరం లేదు, విద్యుత్ కనెక్షన్‌ అంతకన్నా అవసరం లేదు. 24 గంటలూ ఈ స్టవ్‌పై వంట చేసుకోవచ్చు. ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్టవ్‌ను అందుబాటులోకి తేస్తోంది. ప్రస్తుతం దేశంలో వంటగ్యాస్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు ఖరీదు కావడంతో ఇండక్షన్ స్టవ్ లు, ఓవెన్లు వాడడం ప్రారంభిస్తే కరెంటు ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక స్టవ్ మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఉపయోగించడం వల్ల గ్యాస్ లేదా ఇండక్షన్ అవసరం లేదు. ఒక్కసారి ఈ స్టవ్ కొంటే జీవితాంతం ఇంధనం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కాబట్టి ఇది ఖరీదైనదని మీరు అనుకోనవసరం లేదు.     ఇంకా వుంది..

ఎలా పనిచేస్తుంటే..?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంస్థ ఈ స్టవ్‌ను సూర్య నూతన్‌ సోలార్ స్టవ్‌ పేరుతో విడుదల చేసింది. సూర్య నూతన్ స్టవ్‌ను వంటగదిలోనే ఉంచి ఉపయోగించవచ్చు. సరికొత్త టెక్నాలజీతో ఈ స్టవ్‌ను రూపొందించారు. ఇది పాత సోలార్ ఓవెన్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ స్టవ్ రెండు యూనిట్లతో తయారు చేయబడింది. ఒక యూనిట్ వంటగదిలో ఏర్పాటు చేస్తారు. మరొక యూనిట్ ఎండలో ఉంచుతారు.. ఈ విధంగా మీరు ఈ స్టవ్‌ను పగలు, రాత్రి 24 గంటలు ఉపయోగించవచ్చు.
ధరలు పెరగుతున్నాయన్న బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాంకేతికతను రూపొందించింది. ఈ కొత్త టెక్నాలజీ సూర్య నూతన్ సోలార్ స్టన్‌ను గ్యాస్ లేదా విద్యుత్ ఖర్చు లేకుండా జీవితకాలం వంటచేసుకోగలుగుతారు.

ధర ఎంత ఉండొచ్చంటే..?
సూర్య నూతన్‌ సోలార్ స్టవ్ ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్టవ్ ఇండియన్ ఆయిల్ గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ పంపుల వద్ద అందుబాటులో ఉంటుందని చెప్పారు. సూర్య నూతన్ సోలార్ స్టవ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక వేరియంట్ ధర రూ.12,000 కాగా, టాప్ వేరియంట్ రూ.23,000కు అందుబాటులో ఉంది.