సూపర్‌ ఐస్‌ ఆపిల్‌..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్

సూపర్‌ ఐస్‌ ఆపిల్‌..!
– వేసవి రోగాలకు తాటిముంజల రక్షణ
– ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు వదలరు
దర్శిని ప్రతినిధి: వేసవిలో భగభగమనే ఎండలు మోసుకొచ్చినా ఈ సీజన్‌లో లభించే ఐస్‌ ఆపిల్‌(తాటిముంజలు)తో అందరు చల్లబడి పోవాల్సిందే. వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు, పుచ్చకాయ ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయ శరీరానికి ఎక్కువ నీటిని అందించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. వీటితో పాటు వేసవిలో లభించే మరో పండు తాటి ముంజలు విభివన్నమైనవి. ఈ వేసవిలో ఎక్కడ చూసినా తాటి ముంజలు విరివిగా అమ్మడం చూస్తుంటాం. వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు.

పోషకాలు పుష్కలం..
తాటి ముంజలు శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు సి, ఎ, ఇ మరియు కె కూడా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్, పొటాషియం, జింక్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి వేసవిలో వేడి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి, శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం కోసం:
వేసవిలో తాటి ముంజలు తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది అనేక రకాల వేసవి చర్మ సమస్యలను సులభంగా నయం చేస్తుంది. ఈ పండు చెమట పట్టడం, చర్మం ఎర్రబడడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

రోగాల నుంచి కూడా రక్షణ
తాటి ముంజలు వేసవిలో పలు రోగాల నుంచి కూడ రక్షణ కల్పిస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు వేసవిలో ముంజలు తింటే బరువు సులభంగా తగ్గుతారు. ముంజల్లో క్యాలరీలు తక్కువగానూ, నీటిశాతం ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఈ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను కూడా సక్రమంగా నిర్వహించేలా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించే వారు వేసవిలో ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తింటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మనల్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.