శ్రీ సాయి మేధలో ‘కొలువుదీరిన’ బొజ్జ గణపయ్య
– విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పూజలు నిర్వహించిన కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

కుడుములు, ఉండ్రాళ్లు, లడ్లు, పంచభక్ష పరమాన్నంతో నైవేద్యాలు అర్పించి విఘ్నాలు తొలగించాలని వినాయకుడిని వేడుకున్నారు. నాగు పంతులు పూజ అనంతరం వినాయకుని కథను వివరిస్తూ విద్యార్థులు ప్రస్తుత సమాజంలో ఏలా ఉండాలో తెలిపారు.

కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గం ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పేర్కొన్నారు.


