ఆర్బీఓఎల్‌లో చవితి శోభ..!
– మట్టి గణపయ్యకు బీఎస్‌ఆర్ దంపతుల పూజలు
– విఘ్నాలు దూరం కావాలని ఆకాంక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. సోమవారం ఫ్యాక్టరీ ఆవరణలో మట్టి వినాయకున్ని ప్రతిష్టించారు.

ఇందులో భాగంగా ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండి బుయ్యని సరళా రెడ్డి దంపతులు మట్టి వినాయకునికి వేద మంత్రోచ్చరణల మద్య పూజలు నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నాలు లేకుండా నియోజక అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఫ్యాక్టరీ అధికారులకు, సిబ్బంది, భక్తులకు స్వీట్లు పంచిపెట్టారు. వినాయక ప్రతిష్టాపన ఉత్సవాలతో చవితి శోభ సంతరించుకుంది.


