ఐవీఎఫ్‌ అంబలి సేవకు 30 రోజులు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఐవీఎఫ్‌ అంబలి సేవకు 30 రోజులు..!
– సామాజిక దీక్షగా ఉచిత పంపిణీ
– దాతల వితరణతో మరో నెల రోజులు సేవ
– అభినందించిన ఐవీఎఫ్‌ స్టేట్ యూత్ సెక్రటరి రొంపల్లి సంతోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి యేడాది మాదిగిరానే వేసవిలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి సేవ ఈ సారి కూడ విజయవంతంగా కొనసాగతోంది. ఆదివారంతో ఉచిత అంబలి పంపిణీకి 30 రోజులు పూర్తయ్యాయి. వేసవిలో అందరు చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందించాల్సిందే. అయితే ఐవీఎఫ్‌ వారందరికి భిన్నంగా ఉచితంగా మజ్జిగతో పాటు అంబలిని పంపిణీ చేయడంలో వారి సేవా తత్పరతను అభినందించి.. మెచ్చుకోకతప్పదు. ఖర్చుతో కూడిన ఉచిత అంబలి పంపిణీ సేవను ఐవీఎఫ్‌ సామాజిక దీక్షగా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజూ పలువురు దాతల ప్రోత్సహాం అందించడంతో క్రమం తప్పకుండా వేసవి బాటాసారులకు మజ్జింగ, అంబలి వితరణ చేపడుతున్నారు.

ఎంతో మంది పేదలు, బాటసారులు ఐవీఎఫ్‌ అంబలి, మజ్జిగ పంపిణీతో వేసతి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇంతటి మహత్కార్యాన్ని ఐవీఎఫ్‌ జిల్లా నాయకులు ఆగీరు మహేష్‌ అన్నీ తానై ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే 30 రోజులు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని అందరి దాతల సహాకారంతో మరో నెలరోజులు ముందుకు సాగిస్తామని ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రొంపల్లి సంతోష్‌ కుమార్ గుప్త పేర్కొంటున్నారు. సామాజిక సేవలో ఐవీఎఫ్‌ చేస్తున్న సేవా దృక్ఫథాన్ని అభినందించారు. ఉచిత అంబలి, మజ్జిగ పంపిణీలో తోడ్పాటు అందించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.