భళా బాలమేధస్సు..!
– శ్రీ సాయి మేధ విద్యాలయలో జాతీయ అంతరిక్ష దినోత్సవం
– అబ్బుర పరిచిన ఇస్రో ప్రయోగ ప్రదర్శన
– అభినందించిన ముఖ్య అతిథి, కరస్పాండెంట్
తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూర్ పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయలో శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాండూరు బ్రాంచ్ మేనేజర్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యభట్ట రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లిన నాటి నుంచి మన జీవన విధానంలో సైన్స్ పరంగా చాలా మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుత రోజుల్లో విద్యార్థి దశలోనే చాలా మంది సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన చదువు నేర్పడంతో పాటు దేశభక్తి, దైవభక్తి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 2023 ఆగస్టు 23 న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్ ను, రోవర్ ను చంద్రుని పై విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా ఒక మైలురాయిను చేరుకుందని తెలిపారు.
చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం, ఈ విజయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 23 ను భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్ణయించడం చాలా గొప్ప విషయం అన్నారు. విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాలలో అన్ని విషయాలను నేర్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా పాఠశాల స్థాయిలో చదువుతోపాటు అన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

