ప్రజా సంక్షేమానికి పెద్దపీట
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా సురక్షా దినోత్సవ వేడుకలు
– వాలీబాల్ పోటీలు, పథకాలపై నృత్య ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడో రోజు ఆదివారం తాండూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డిల సమక్షంలో పట్టణంలోని ఇందిరానగర్ గుండు పేర్ల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడాకారులకు వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.

ఎమ్మెల్యే రోహిత రెడ్డి వాలీబాల్ త్రో చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎడిఎఫ్ఎస్ డాన్స్ ఇన్పుట్యూబ్, వీఎస్ డాన్స్ ఇన్సుట్యూట్ వెంకట్, శివ మాస్టర్ల ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పై చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పోలీసు అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో తీసుకవచ్చిన సంస్కరణలు వివరించారు. డయల్ 100, పెట్రోలింగ్, బ్లూకోర్స్ వాహనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు, సైబర్ నేరాల నియంత్రణ వంటి చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంతో పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు వచ్చాయన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు నేరాల నియంత్రణకు పెద్ద పీట వేసిందన్నారు. పోలీసు శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వాలీ బాల్ పోటీ విజేతలకు నగదు
మరోవైపు మరక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఉత్సహాంగా కొనసాగాయి. ఈ పోటీలో ముంబాపూర్ టీం, సాయి నగర్ టీఐలు పోటీ పడ్డాయి. ముంబాపూర్ జట్టు విజేతగా నిలవగా.. సాయి నగర్ టీం రన్నర్ గా నిలించింది. మొదటి జట్టుకు రూ. 5వేలు, రెండో జట్టుకు రూ. 3 వేల నగదును నేతలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, అస్లాం, భీంసింగ్, ప్రభాకర్ గౌడ్, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ సలీం, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ ఆతహర్, అంతారం సర్పంచ్ రాములు, అక్రమ్, నాయకులు, కార్యకర్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…


