బొడ్రాయి ప్రతిష్టాపనకు పైలెట్ చేయూత
– రూ. 2 లక్షలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ప్రతిష్టించనున్న బొడ్రాయి (నాభిశిల)కు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేయూతనందించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేది నుంచి 10వ తేది వరకు పాత తాండూరులో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కమిటి సభ్యులు మంగళవారం హైదరాబాద్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బొడ్రాయి ప్రతిష్టాపన కోసం తన వంతుగా రూ. 2 లక్షల విరాళాన్ని కమిటి సభ్యులకు అందజేశారు. అదేవిధంగా కమిటి సభ్యులు బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలకు రావాలని ఆహ్వానించడంతో సతీసమేతంగా హాజరవుతానని హామి ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. దీంతో పాటు అడిగిన వెంటనే ప్రతిష్టాపనకు రూ. 2 లక్షల విరాళం అందించడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రం శ్రీధర్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు, కమిటి సభ్యులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

