బక్రీద్ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక బృందాలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

బక్రీద్ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక బృందాలు
– బహిరంగంగే పడేయకుండా నేరుగా అందించాలి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బక్రీద్ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తాండూరు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ తెలిపారు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి సుమారు 8 వార్డులకు ఒక బృందం చొప్పున 7 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 1వ బృందంలో 1, 2, 3, 4, 5, 6, 24, 25 వార్డులకు సంబంధించి జవాన్ రవి (సెల్: 7799603051), 2వ బృందంలో 7, 9, 10, 11, 12, 28, 29, 30 వార్డులకు సంబంధించి జవాన్ ఎం. గోపాల్ (సెల్: 9581827162) 3వ బృందంలో 13, 14, 15, 16, 17, 18 వార్డులకు సంబంధించి జవాన్ వెంకటేష్ (సెల్: 8919788829), 4వ బృందంలో 27, 31, 32, 34, 35, 36 వార్డులకు సంబంధించి జవాన్ రమేష్/భూపతి (సెల్: 9848281143, 9177202791), 5వ బృందంలో 26, 27, 33, 34 వార్డులకు సంబంధించి జవాన్ వీరణ్ణ(సెల్: 9553257645), 6వ బృందంలో 19, 20, 21, 22, 23 వార్డులకు సంబంధించి ఎం. శ్రీనివాస్ (సెల్: 7981290884), 7వ బృందంలో 7, 8వ వార్డులు రాజీవ్, ఇందిరమ్మ కాలనీలకు సంబంధించి జవాన్ సీహెచ్ అశోక్ (సెల్: 1938598934)లను కేటాయించడం జరిగిందన్నారు. వ్యర్థాల సేకరణకు వారిని సంప్రదించాలని సూచించారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage