ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు
– పాలక మండలి భాధ్యతగా పనిచేయాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా నగరేశ్వరాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ నగరేశ్వర దేవాలయ పాలకవర్గ కమిటి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో ఆలయ చైర్మన్ గా కుంచెం మురళీధర్, ప్రధాన అర్చకులుగా దామోదర్ చారి, ధర్మకర్తలుగా ముదేళ్ల పురుషోత్తం, కల్వ వీరేశం, నెమలీగ నరహరి, పోకల నర్మదలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆలయ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరేశ్వర దేవాలయ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఆలయం అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, తాండూరు మున్సిపల్ చైర్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, దేవాలయాల చైర్మన్లు రాజన్ గౌడ్, కమలాకర్, వివిధ రాజకీయ, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

