రన్‌వేపై దొర్లిన విమానం..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

రన్‌వేపై దొర్లిన విమానం..!
– లాండింగ్ అవుతుండగా సంఘటన
– వైరల్‌ అయిన వీడియో
దర్శిని డెస్క్‌: రన్‌వేవై లాండింగ్ అయిన విమానం అదుపు తప్పి దొర్లింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సిబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ఎయిర్‌పోర్టు నుంచి ప్రీమియర్‌ 1ఏ విమానం బయల్దేరిన కొద్ది సేపటికే సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది. ఈ విమానం టేకాఫ్‌ అయిన తర్వాత ముందు వైపునున్న నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ రీట్రాక్ట్‌ అవలేదు. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకెళ్లింది. అప్పటికే నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. హాల్‌ ఎయిర్‌పోర్టులో విమానం దిగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీడియోను కింద ట్విట్టర్ లింక్‌లో చూడొచ్చు..

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage