హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించుకుందాం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించుకుందాం..!
– ఈ పనులు చేస్తే మంచి ఉపయోగం
– పండ్లు, పానియాలతో అడ్డుకట్ట
దర్శిని డెస్క్ : ఈ ఆధునిక కాలంలో చిన్నా, పెద్దా అంతా గుండె పోటుతో మరణిస్తున్నారు. ప్రస్తుత విపరీతమైన వేడిలో పక్షవాతం, గుండెపోటు మరణాలు జరుగుతున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది సిరలు లేదా ధమనులలో అడ్డంకికి దారితీస్తుంది. దీని ప్రభావం గుండె నుంచి మెదడు వరకు ఉంటుంది. సిరలు, ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి పరిణామాల మద్య అందరు గుండెను కాపాడుకునే అవసరం అందరిపై ఏర్పడింది. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడంతో పాటు కొన్ని సాధారణ పండ్లు, పానీయాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అడ్డంకులను నివారించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చాలా మంది టీ, కాఫీ తాగుతుంటారు. వాస్తవానికి వేసవిలో టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. అయితే, టీ, కాఫీలోని కెఫిన్ నరాలను ఉత్తేజపరచడమే కాకుండా, సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా, ప్రతిరోజూ కొంత మొత్తంలో కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

జంక్ ఫుడ్ లేదా ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల సిరలు, ధమనులలో అడ్డుపడటానికి దారితీస్తుంది. కొన్ని సాధారణ పండ్లు, పానీయాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అడ్డంకులను నివారించవచ్చు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్.. సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పిస్తా, జీడిపప్పు, అంజీర పండ్లను ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సిరలు, ధమనులలో అడ్డంకుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వేడి వాతావరణంలో ప్రతిరోజూ ఎండుద్రాక్షను తక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకోండి.

కొలెస్ట్రాల్‌ను తగ్గించే మరో ముఖ్యమైన పండు స్ట్రాబెర్రీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు ఉంటాయి. గుండె ఆగిపోకుండా ఉండటానికి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి స్ట్రాబెర్రీలను తినండి.

గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన పండు అవకాడో. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా, ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇదికూడా చదవండి…

రూ. 20కే సంపూర్ణ భోజనం..!