వాట్సాప్‌లో కొత్త ఫీచర్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..!
– నెంబర్ సేవ్‌ లేకుండా చాటింగ్ చేయొచ్చు
– ఎలా వినియోగించాలంటే..?
దర్శిని డెస్క్‌: దేశంలో అత్యధిక యూజర్లను కలిగిన వాట్సాప్‌ వ్యవస్థ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. తాజాగా మెటా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్పప్ యూజర్లకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మొబైల్‌లో నెంబర్‌ సేవ్ చేయకుండానే అతలి వారితో చాటింగ్ చేసే వెసులుబాటులో తీసుకవచ్చింది. ఇంతకుముందు వినియోగదారులు తమ కాంటాక్టు సమాచారాన్ని ముందుగా సేవ్ చేయకుండా WhatsAppలో ఎవరితోనైనా చాట్ చేసేందుకు పరిమితులు ఉండేవి. థర్డ్-పార్టీ యాప్‌లు లేదా అధికారిక క్లిక్- టు -చాట్ APIలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇది కొంతమంది వినియోగదారులకు అసౌకర్యంగా కలిగి ఉండొచ్చు. ప్రస్తుతం iOS, Android ఫోన్లలో అందుబాటులో తెచ్చింది.

ఎలా వినియోగించాలంటే…?
వినియోగదారులు వాట్సాప్‌ ద్వారా కొత్త ఫీచర్‌ను వినియోగించేందుకు కింద చేయాల్సి ఉంటుంది. ముందుగా కాంటాక్టు లిస్ట్ ను ఓపెన్ చేసిన మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ ను వెతకాలి. iOS కోసం అయితే WhatsAppలో చాట్ జాబితాలోని “Start new chat” బటన్‌ను ప్రెస్ చేయాలి. సెర్చ్ బార్ లో మీరు కోరుకుంటున్న నెంబర్ ను ఎంటర్ చేయాలి. WhatsAppలో పరిచయం ఉన్నట్లయితే వారితో చాట్ చేయొచ్చు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage