పైసా వసూల్..?

తాండూరు రాజకీయం వికారాబాద్

పైసా వసూల్..?
– ప్రభుత్వ కాలేజీ అద్యాపకుల నిర్వహకం
– ఫ్యాన్లు, ఫర్నీచర్, లైట్ల కోసం విద్యార్థుల నుంచి దోపిడి
– సంచలనమైన బీఆర్ఎస్వీ నేతల ఆరోపణలు
– ప్రిన్సిపల్, అద్యాపకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొందరు అద్యాపకులు పైసా వసూళ్లకు పాల్పడినట్లు బీఆర్ఎస్వీ నేతలు ఆరోపించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థుల నుంచి నుంచి డబ్బులు దోపిడి చేశారని మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్వీ నాయకులు దీపక్ రెడ్డి, పలువురు విద్యార్థులు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ను కలిశారు. గతకొన్ని రోజులుగా కళాశాలలో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కళాశాలకు చెందిన కొందరు అద్యాపకులు కాలేజీలో లైట్లు, ఫర్నీచర్, ఫ్యాన్ల కోసం వసూళ్ల దందాలు చేస్తున్నారని ఆరోపణలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాలేజీలో విద్యార్థులు గ్రూపులు మార్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసిందన్నారు. కాలేజీలో డబ్బుల వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కళాశాల ముందు దీపక్ రెడ్డి మాట్లాడుతూ కాలేజీలో డబ్బుల వసూళ్లకు పాల్పడిన అద్యాపకులతో పాటు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కళాశాలలో అద్యాపకులు డబ్బులు వసూలు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని ప్రిన్సిపల్ రాజమోహన్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ కాలేజీలో వసూళ్ల దందాపై బీఆర్ఎస్వీ నాయకులు చేసిన ఆరోపణలు తాండూరులో చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!