పచ్చి కొబ్బరితో ఆరోగ్యం పదిలం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

పచ్చి కొబ్బరితో ఆరోగ్యం పదిలం..!
– ఇందులోని మేలు డయోబెటిక్లకు వరం
– మరిన్ని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
దర్శిని డెస్క్‌: పచ్చి కొబ్బరి అందరికి పరిచడం అక్కర్లేని పేరు. కొబ్బరితో పాటు దాని నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పదార్దం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అద్యయనాలు చెబుతున్నాయి. చలికాలంలో పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరిలో ఉండే ట్రైగ్లిజరైడ్ శరీరంలోని కొవ్వును త్వరగా కాల్చడానికి సహాయపడుతుంది. ఇందులో కాపర్, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇందులో ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ కూడా పరిమిత పరిమాణంలో ఉంటాయి. ఇది కాకుండా పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వు శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వుగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ పచ్చి కొబ్బరిని తినవచ్చు.

మెదడు పనితీరు మెరుగు
పచ్చి కొబ్బరిలో విటమిన్ బి6, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ మెదడును బలోపేతం చేస్తాయి. దాని పనితీరును పెంచుతాయి. పచ్చి కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు వేగంగా, సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పచ్చి కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 61శాతంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ముఖ్యమైంది. దీంతో కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా డయోబెటిక్‌ నియంత్రణకు మంచిగా పనిచేస్తుంది. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఇది ఒక వరం.

శరీర బరువును తగ్గిస్తుంది
పచ్చి కొబ్బరిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను (Good cholesterol) పెంచి శరీర బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తాయి. శరీర బరువును అదుపులో ఉంచి శరీరానికి మేలు చేసే పోషకాలను (Nutrients) అందిస్తాయి.

క్యాన్సర్ ను నిరోధిస్తుంది
పచ్చి కొబ్బరి క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యాన్ని (Capacity) సైతం కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో క్యాన్సర్ (Cancer) కణాల వృద్ధిని తగ్గించి క్యాన్సర్ ను నిరోధిస్తుంది. పచ్చి కొబ్బరిలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నిరోధించడానికి సహాయపడుతుంది.

ఇదికూడా చదవండి…

సుపరిపాలనే కాంగ్రెస్ ధ్యేయం..!