విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
– నీట్ పరిక్ష నిర్వహణలో బీజేపీ విఫలం
– ప్రశ్నాపత్రం లీక్‌లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష నిర్వహణలో ప్రశ్నాపత్రం లీకేజీ కావడం కేంద్ర ప్రభుత్వందే పూర్తి నిర్లక్ష్యం అని అన్నారు.

దీనిపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలతో, పారదర్శకత లోపించడం వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువత జీవితాలతో రాజకీయాలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నీట్ పరీక్ష వ్యవస్థలో పూర్తి పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని అన్నారు. మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు.

దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి