ఆరోగ్యానికి అమృతం తిప్పతీగ..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

ఆరోగ్యానికి అమృతం తిప్పతీగ..!
– మెరుగైన రోగనిరోధక శక్తి మెండు
– గురక, దగ్గు నుంచి స్వాంతన
దర్శిని డెస్క్ : ఆయుర్వేదంలో కీలకంగా వాడే తిప్పతీగ ఆరోగ్యానికి అమృతంలా పనిచస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోజు రెండు ఆకులను నమిలితే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిలో లభించే అద్భుతమైన మొక్కల్లో తిప్పతీగ ఒకటి. పురాతన కాలం నుండి సాంప్రదాయ వైద్యంలో దీని పాత్ర ఎంతో ఉంది. పట్టణాల్లో ఉండేవారికి దీని గురించి తెలియకపోవచ్చు కానీ.. పల్లెటూర్లలో ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మెరుగైన రోగనిరోధక శక్తి కోసం దీన్ని తీసుకుంటారు. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. తిప్పతీగ సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది.

వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి ఉపకరిస్తుంది. యాంటీ-పైరేటిక్ స్వభావం కలిగి ఉండటం వలన విష జ్వరాలతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మరికొన్ని ప్రయోజనాలు ఇంకా తెలుసుకుందాం..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మన శరీరానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్‌ను అదుపు చేయడంలో తిప్పతీగ మీకు సహాయపడుతుంది. హెపటైటిస్, జ్వరం, ఆస్తమా, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. శ్వాస ఆడకపోవడం, ఛాతీ బిగుతుగా ఉండడం, గురక, దగ్గు, వంటి లక్షణాలను నుంచి తిప్పతీగ స్వాంతన ఇస్తుంది. తిప్పతీగ కాండం మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుందని యూరోపియన్ మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ అధికారిక జర్నల్ అయిన మాట్యురిటాస్‌లో ప్రచురితమైన ఒక నివేదిక స్పష్టం చేసింది. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా మంచిది. తిప్పతీగతో కామెర్లు నయం చేయవచ్చు. తిప్పతీగతో మూత్ర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. తిప్పతీగతో పౌడర్, కాప్సూల్స్, జ్యూస్, తయారు చేసి అమ్ముతారు.

నోట్ : గర్బిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు తిప్పతీగ వాడితే ప్రమాదం అని అంటారు. అందుకే ఎవరైనా సరే తిప్పతీగ తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను, వైద్యులను సంప్రదించండి..

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!