దేశం, పార్టీ ఎప్పటికి మరవదు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దేశం, పార్టీ ఎప్పటికి మరవదు..!
– మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటు
– తాండూరులో కాంగ్రెస్ నేతల నివాళులు
– క్యాంపు కార్యాలయంలో అంజలి ఘటించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మనో ్మహన్ సింగ్ ను ఎప్పటికి గుర్తించుకుంటుందని ఆ పార్టీ తాండూరు నేతలు అన్నారు. శుక్రవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని మనో ్మహన్ సింగ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు ఉత్తమ్ చంద్, సర్దార్ ఖాన్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించి.. అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధానిగా, ఆర్థిక వేత్తగా, గొప్ప రాజకీయ, సామాజిక నాయకులుగా దేశానికి ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన సేవలను దేశంతో పాటు పార్టీ, ప్రజలు ఎప్పటికి గుర్తించుకుంటారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, భీంసింగ్, వెంకన్నగౌడ్, మహిళ నాయకురాలు గాజుల మాధవి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పాత కుంటలో మురుగు వివాదం…!