తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తీక

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తీక
– నేటి నుంచి బ‌తుక‌మ్మ సంబ‌రాలు
ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యంతో బతుకమ్మకు సమర్పిస్తారు.

ఆశ్వయుజ మాసం ఆరంభం.. అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవ‌డం ఆన‌వాయితీ. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై.. ఆడపడచుల ఆటపాటలతో దద్దరిల్లుతోంది. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో పువ్వులను అమ్మవారి రూపంగా కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. తంగేడు, మందార, సీతజడపువ్వులు, గుమ్మడి, గోరంటపూలు, కట్లపువ్వులు, గునుగు పువ్వులతో పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మ పాటలతో ఆరాధిస్తారు. ఈ వేడుక 9రోజుల పాటు ఈ పూలజాతర జ‌రుపుకుంటారు.

ఆత్మగౌరవ పతాక బతుకమ్మ.. సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. జీవన చైతన్యం బతుకమ్మ.. తంగేడుపూల సౌందర్య చిహ్నం బతుకమ్మ.. అన్ని క‌ల‌గ‌ల‌సి తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ‌. ఒక్కేసీ.. పువ్వేసీ.. సంద‌మామ అంటూ నేటి నుంచి బ‌తుక‌మ్మ సంబ‌రాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమైన బతుకుమ్మ ఉత్సవాలకు ఆడపడుచులు రెడీ అయ్యారు.. పువ్వుల పరిమళాలతో ప్రతీ గడపలోనూ వెదజల్లనుంది.. బతుకమ్మ పాటలతో 9రోజులు.. తెలంగాణ హోరెత్తి పోనుంది.

తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యంతో బతుకమ్మకు సమర్పిస్తారు.

సంతోషంగా జ‌రుపుకోవాలి: తాండూరు నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మన ఆడబిడ్డలందరూ సంతోషంగా జరుపుకోవాలి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం సద్దుల బతుకమ్మ తో ముగింపుతో తొమ్మిది రోజుల పాటు వాడ వాడలో సందడిగా చేసుకోవాలి. జాగృతి అధినేత్రి క‌ల్వ‌కుంట్ల క‌విత త‌రుపున ప్ర‌జ‌లంద‌రికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.