జాతీయ పోటీల్లో కూడా సత్తా చాటాలి
– అథ్లెటిక్స్ విజేత సంతోషికి ఘన సన్మానం
– అభినందనలు తెలిపిన కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తాండూరుకు చెందిన సంతోషిని జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, వాసవీ మహిళ సంఘం తాండూరు అధ్యక్షులు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ లు ఆకాంక్షించారు. బుధవారం వారి నివాసంలో సంతోషి కి ఘనంగా సన్మానం చేశారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేది వరకు కేరళ రాష్ట్రంలోని త్రీశూర్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలో సంతోషిని పాల్గొంటున్న సందర్భంగా ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ నాలుగు పదుల వయస్సులో క్రీడా పోటీల్లో సత్తా చాటుతూ సంతోషి స్పూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా సత్తా చాటి తాండూరుకు పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు.
ఇదికూడా చదవండి…

