తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ..?

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ..?
– ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో
– మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ చర్చలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపొందాలని భావిస్తోంది. అందుకోసం కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీని రంగంలోకి దించే ప్లాన్ వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సైతం రాహుల్ గాంధీ పోటీ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్‌గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానాలను కూడా రిజర్వులో ఉంచింది.

అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌ ఎంపీగా ఉన్నారు. ఈ సారి జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి స్థానాల నుంచి పోటీలో నిలిచే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరారు. అప్పట్లో అధిసాధ్యం కాలేదు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!