సందడిగా క్రిస్మస్ సంబరాలు
– మార్మోగిన ప్రార్థనామందిరాలు
– వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో క్రిస్మస్ పండగను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చీలలో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవ సోదరులు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు.

చెర్చీలలో ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. తాండూరులోని మార్వాడీ బజార్‌లోని మెథడిస్ట్ చర్చి, గ్రీన్ సిటీలోని ఏజీ ఇమ్మాన్యూయల్ చర్చి, రాజీవ్ కాలనీలోని నజరేత్ చర్చిలలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా కిక్కిరిసి కనిపించింది. అందరూ కలిసి ఏసును భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. చెర్చీలలో ప్రార్థనల అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుకున్నారు.
వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
మరోవైపు తాండూరులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేరు వేరుగా పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని మెథడిస్ట్ చర్చి, రాజీవ్ కాలనీలోని నజరేత్ చెర్చిలలో క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేశారు.

రాజీవ్ కాలనీ చెర్చీలలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతికి రూపం, దయగల హృదయుడు, లోక రక్షకుడైన యేసు మార్గం అందరికి అనుసరణీమని అన్నారు. అదేవిధంగా తాండూరులో చెర్చిల అభివృద్ధి, క్రైస్తవుల సంక్షేమానికి తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మైనార్టీ క్రిస్టియన్ చైర్మన్ అంకిత్ అనురాగ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు గడ్డలి రవిందర్, బిడ్కర్ రఘు, భగవాన్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి. వెంకట్ రెడ్డి, యూను స్, వివిధ పార్టీల నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

