వాల్మీకీ బోయ కార్పోరేషన్ చేర్చండి

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

వాల్మీకీ బోయ కార్పోరేషన్ చేర్చండి
– మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు విజ్ఞప్తి
– వినతిపత్రం అందజేసిన వాల్మీకీ బోయ సంఘం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కార్పోరేషన్లలో వాల్మీకీ బోయ కార్పోరేషన్ ను కూడా చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు రాష్ట్ర వాల్మీకీ బోయ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బోయ అశోక్ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లలో వాల్మీకీ కార్పోరేషన్ లేకపోవడం బాధాకరమని మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. కొత్త కార్పోరేషనతో పాటు వాల్మీకీ కార్పోరేషన్ ను కూడా చేర్చాలని కోరారు. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి కార్పోరేషన్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పినట్లు వికారాబాద్ జిల్లా సంఘం అధ్యక్షులు బోయ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గోపాల్, సంఘం నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!