తేల్చుకుందాం.. సాధించుకుందాం..!
– బీసీ బిల్లుపై రిజర్వేషన్ల చట్టం తీసుకరావాలి
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు తరలిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై అటో.. ఇటో తేల్చుకుందాం.. సాధించుకుందామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా సోమవారం కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు బీసీ సంఘం నేతలు తరలివెళ్లారు. దీక్షలో ఆర్.కృష్ణయ్యకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆర్టీకల్ 246 ప్రకారం ప్రభుత్వం అధికారాలను వినియోగించుకుని అసెంబ్లీలో చట్టం పాస్ చేయాలని రాష్ట్రంలోని 14 బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు చట్టాన్ని తీసుకరావాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనుకడుగు వేసేది లేదని, హక్కులను సాధన కోసం తేల్చుకునేందుకు సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిట్టు వెంకటేష్, పవన్ కుమార్, సత్తార్, శ్రీశైలం, వివేక్, మల్లేశం, జిషాన్, గోపాల కృష్ణ యాదవ్, రాఘవేంద్రచారి, వన్న చేడ్ రాములు, మహబూబ్ మియా, గౌరి, తిప్పన్న, సంపత్ కుమార్, మహమ్మద్ లియాకత్, వడ్డె పరుశురాం, బొంకూరు విఘ్నేష్, జహంగీర్ భాష, చాకలి గుండప్ప, చంద్రవంచ సురేష్, కాశప్ప తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

