ఆర్ఎంపీ డాక్టర్ అరెస్టు, రిమాండ్..!
– సర్టిఫికెట్ లేని నకిలీ వైద్యుడుగా గుర్తింపు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అశ్లీల విడియోలను వాట్సాఫ్ ఫార్వర్డ్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ భాగోతం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలోని ఆర్ఎంపీ డాక్టర్ అహమద్ అలీయాస్ అంజు(46)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఆర్ఎంపీ వైద్యుడుగా చెలామణి అవుతున్న అహమద్ ఓ మహిళలో ఉన్న అశ్లీల దృశ్యాలను వాట్సాప్ గ్రూపులలో ఫార్వడ్ చేశారు. బాధిత మహిళ ఈనెల 11న తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు ఆర్ఎంపీ వైద్యుడు కోసం గాలింపు చేపట్టారు. అప్పటి నుంచి పరారిలో ఉన్న అహమద్ ను శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా ఉద్దండాపూర్ లో అరెస్టు చేయడంతో పాటు రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అదేవిధంగా అహమద్ ఎలాంటి ఆర్ఎంపీ, ఫస్ట్ ఏయిడ్ సర్టిఫికెట్ లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతనిపై రేప్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ప్రివెంటివ్ యాక్ట్, చీటింగ్ అభియోగాలతో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఇదికూడా చదవండి…

