మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా దావత్ ఏ ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభ్యున్నతికై కోసం పాటు పడుతున్నట్లు గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా తాండూరు పట్టణంలోని నేషనల్ గార్డెన్ లో దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఘనంగా జరిగింది.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి విందు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలను గౌరవంగా నిలబెట్టారని, దేశంలో ఇఫ్తార్ విందు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. ముస్లిం ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచేలా షాదీ ముబారక్ పేరిట ఆర్థిక సాయం అందిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని చెప్పారు. అంతే కాకుండా విద్య కోసం పెద్దపీట వేశారని మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి వారి చదువుకు భరోసా అందిస్తున్నారని తెలిపారు. దేశంలో మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతి కోసం పాటు పడుతూ తెలంగాణ రాష్ట్ర మోడల్ గా నిలిచిందని ఇటీవలే ఓ నివేదిక కూడా తెలిపినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రంజాన్ మాసంలోని ఇఫ్తార్ విందులు మత సామరస్యతను పెంపొందిస్తాయన్నారు. పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ప్రధానకార్యదర్శి సంతోష్ గౌడ్, మైనార్టీ నాయకులు, తాండూరు మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


