లక్ష్యం దిశగా ఎస్‌ఐఆర్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

లక్ష్యం దిశగా ఎస్‌ఐఆర్‌
– తాండూరులో 72 శాతం పూర్తి
– 33 పోలింగ్ కేంద్రాల్లో 100శాతం
– ఏఎస్‌డీలో 84శాతం ప్రక్రియ
– టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం తాండూరు నియోజకవర్గంలో 100శాతం లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని టీపీసీసీ ప్రచార సమన్వయకర్త, ఎస్ఐఆర్ తాండూరు నియోజకవర్గ కన్వినర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు.

బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియ సుమారు 72.47 శాతం పూర్తయిందని, మొత్తం 2,52, 235 ఓటర్లు ఉండగా అందులో 2,15,559 ఓటర్ల డిజిటలైజేషన్ చేయడం జరిగిందని చెప్పారు. అర్హత గల ఓటర్లను 1,82,804 మందికి సంబంధించి డిజిటలైజ్ చేయబడినట్లు పేర్కొన్నారు. ఇంకా 36,676 ఫార్ములు డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. అబ్సెంట్, షిప్టింగ్‌, మరణించిన వారికి సంబంధించిన ప్రక్రియ కూడా 84 శాతం పూర్తి అయ్యిందని వెల్లడించారు.

తాండూరు నియోజకవర్గంలోని యాలాలలో 12, తాండూరు మండలంలో 4, పెద్దమేఉల్ మండలంలో 5, బషీరాబాద్‌ మండలంలో 12 పోలీంగ్ కేంద్రాలతో 33 పోలింగ్ కేంద్రాలలో 100శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి అయ్యిందని వివరించారు. బషీరాబాద్‌ మండలంలో 96.75శాతం పూర్తికాగా ఇంకా 1343 ఫారాల డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. పెద్దేముల్ మండలంలో 92.69శాతం నమోదు కాగా 3022 ఫారాల డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

యాలాల మండలంలో 92.77శాతం పూర్తి కాగా 3059 ఫారాల డిజిటలైజేషన్, తాండూరు మండలంలో 87శాతం పూర్తిగా 5786 ఫారాల డిజిటలైజేషన్, తాండూరు పట్టణంలో 68.94 శాతం పూర్తిగా ఇంకా 22,968 ఫారాల డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. మిగతా కేంద్రాల్లో 90 శాతానికి పైగా పురోగతి నమోదైందని తెలిపారు.

అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ శాతం ఇంకా తక్కువగా ఉండటంతో సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్‌ఓలు, పార్టీ బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఆగస్టు 3వ తేది వరకు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అర్హులైన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ఫారాలను త్వరగా అందించి.. డిజిటలైజేషన్ చేయించుకోవాలని సూచించారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఏం జరిగింది..?