అష్పాక్ గురి తాండూరుకు గర్వకారణం
– యూపీఎస్సీ ర్యాంకర్‌కు ముస్లిం వెల్పేర్ అభినందన
– యువతకు స్పూర్తి నింపిన అష్పాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సివిల్స్ లక్ష్యానికి గురిపెట్టిన అష్పాక్ అనుకున్నది సాధించి తాండూరుకు గర్వకారంగా నిలిచాడని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. శనివారం తాండూరు పట్టణంలోని అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అథహర్ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ ఇంతియాజ్ తదితరులు ఆష్పాక్ ను సన్మానించారు.ఈ సందర్భంగా అష్పాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంసెట్ కోచింగ్ అభ్యర్థులకు తన విజయ లక్ష్యాలను పంచుకున్నారు. ఇష్టపడిన దానికోసం కష్టపడి చదవాలని అభ్యర్థులలో స్పూర్తి వింపడంతో ఆష్పాక్ ను అందరు అభినందించారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అష్పాక్ ఉన్నత స్థాయికి ఎదగాలని, అతనిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, అష్పాక్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

