టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
– రిలీజ్ చేసిన ఎడ్యూకేషన్ చీఫ్ సెక్రటరీ
– ఈ వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను శనివారం స్టేట్ ఎడ్యూకేషన్ చీఫ్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
* అనంతరం TS EAPCET 2024 Results ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
* TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోండి.


ఇదికూడా చదవండి…

