వినాయాక చవితి ఉత్సవాలకు సహకరించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

వినాయాక చవితి ఉత్సవాలకు సహకరించండి
– తాండూరు హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి
– డీఎస్పీ, పట్టణ సీఐలకు ఘనంగా సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహాకారం అందించాలని తాండూరు డీఎస్పీ, పట్టణ సీఐలను హిందూ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. శుక్రవారం ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్‌ లను మర్యాదపూర్వకంగా కలిశారు. సమితి గౌరవాధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తో కలిసి పట్లోళ్ల నర్సింలు, సభ్యులు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. చవితి, నిమజ్జన ఉత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి యేడాది మాదిరిగానే గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతల విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ వినాయక చవితి, నిమజ్జన ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రతి యేడాదిలాగా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, సమితి ఉపాధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, బిర్కడ్ రఘు, రాము, అంతారం కిరణ్‌, కోశాధికారి భాను కుమార్, సభ్యులు మిర్చి వెంకట్, మంతన్ గౌడ్ అశోక్, తాండ్ర నరేష్, దావులయ్య, రజక నర్సింహా, పరమేష్‌, సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక