రేపు విద్యుత్ అంతరాయం
– విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు మండలంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు డీఈ బాను ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని కరణ్ కోట్, గౌతాపూర్ 220కేవీ ఫీడర్ మరమ్మత్తులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ కారణంగా గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

