విద్యార్థుల భద్రతకు చర్యలు
– నాణమైన భోజనం అందించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– మైనార్టీ బాలికల వసతిగృహం తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.

తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మైనార్టీ గర్ల్స్ హాస్టల్ వెనుక భాగంలో ప్రహరీ గోడ కూలిపోయింది. సోమవారం ఈ విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి వసతిగృహాన్ని సందర్శించారు. ప్రహారి గోడ వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం చైర్ పర్సన్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యత, వసతి సౌకర్యాలు, ఇతర సమస్యల గురించి విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. చైర్ పర్సన్ వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, వార్డు కౌన్సిలర్ జావిద్, నాయకులు జిలాని, వార్డు జవాన్ సిహెచ్ అశోక్ తదితరులు ఉన్నారు.


