స్ఫూర్తిదాయకురాలు చాకలి ఐలమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్

స్ఫూర్తిదాయకురాలు చాకలి ఐలమ్మ
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో నివాళులర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజానికానికి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అందరికి స్పూర్తి దాయకురాలు అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని జరుపుకున్నారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై సంఘం నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, హక్కుల కోసం పోరాటం చేసి చాకలి ఐలమ్మ చిరస్మరనీయురాలుగా నిలిచిందన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు కృష్ణ, తాండూరు డివిజన్, పట్టణ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకుందాం..!