నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకుందాం..!
– రేపటి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
– హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు
– యాలాల కోకట్ కాగ్నానది వద్ద భారీ సౌకర్యాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందామని, ఇందుకు తగిన భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్, పోలీసు, మున్సిపల్, ప్రభుత్వ శాఖలతో పాటు సమితి సభ్యుల సహాకారంతో యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని కాగ్నానదిలో ఈ సారి నిమజ్జన వె డుకలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాగ్నానది వద్ద విద్యుత్, మున్సిపల్, ఫైర్ శాఖల సహాకారంతో నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనివిని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సమితి సభ్యులు, మండపాల నిర్వహకులు సంపూర్ణ సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.
ఇదికూడా చదవండి…

